Breaking News
Home / National / పలు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు….

పలు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు….

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి,  కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.  సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణకేంద్రం వెల్లడించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *