చెన్నై: తమిళనాడులోని రామనాథపురం, మధురైలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో స్కూళ్లు, కాలేజీలకు ఈరోజు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశాలున్నాయి. వాతావరణశాఖ సూచనల నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
