Breaking News
Home / National / అరేబియా సముద్రంలో అల్పపీడన అతి భారీ వర్షాలు

అరేబియా సముద్రంలో అల్పపీడన అతి భారీ వర్షాలు

న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల మూడు, నాలుగు రోజుల్లో కర్ణాటక సముద్ర తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేర శుక్రవారం ఉదయం ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ బులిటిన్ విడుదల చేసింది. అల్పపీడన ప్రభావం వల్ల శుక్రవారం రాయలసీమ, తెలంగాణ, కేరళ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.మత్స్యకారులు అరేబియా సముద్రంలో కొన్నాళ్లపాటు చేపలవేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. లక్షద్వీప్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వల్ల కర్ణాటక, కొంకణ్ తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్యమహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరాయికల్ ప్రాంతాల్లో శుక్రవారం భారీవర్షాలు కురవవచ్చని కేంద్ర వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర హర్యానా, చంఢీఘడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవవచ్చని అధికారులు వివరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *