Breaking News
Home / States / Andhra Pradesh / కోస్తాలో భారీ వర్షాలు

కోస్తాలో భారీ వర్షాలు

విశాఖపట్నం: కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. కొమెరిన్‌ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితలద్రోణి కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమగాలులు రావడంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత తగ్గుముఖం పడతాయని వివరించింది. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ గురువారం తెలిపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *