Breaking News
Home / National / ఢిల్లీలో ఉరుములు,మెరుపులతో భారీవర్షం

ఢిల్లీలో ఉరుములు,మెరుపులతో భారీవర్షం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురుస్తోంది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఢిల్లీల్లో ఆదివారం ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు భారీవర్షాలు కురవవచ్చని అధికారులు చెప్పారు. భారీవర్షాల వల్ల ఆదివారం ఢిల్లీలో పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *