Breaking News
Home / Film News / అభిమానులకి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న హీరో…

అభిమానులకి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న హీరో…

ఫిల్మ్ న్యూస్: మాస్ మహరాజా రవితేజ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే సైంటిఫిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నబా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే దీపావళి సందర్భంగా రవితేజ తన అభిమానులకి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. తన 64వ చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో చేయనున్నది తెలియజేయనున్నాడు. మధ్యాహ్నం 2గం.లకి దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *