Breaking News
Home / Crime / అతడి వల్లే ‘బయోడైవర్సిటీ’ ప్రమాదం….

అతడి వల్లే ‘బయోడైవర్సిటీ’ ప్రమాదం….

హైదరాబాద్‌: రాజధానిలో కలకలం రేపిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ కారు ప్రమాదం కేసు హైకోర్టుకు చేరింది. ప్రమాదానికి కారకుడు కల్వకుంట్ల కృష్ణ మిలన్‌రావు అని తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌లో రాయదుర్గం పోలీసులు పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రమాదానికి కృష్ణ మిలన్‌రావు కారణమని, అతడి నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కృష్ణ మిలన్‌రావు 120 కిలోమీటర్ల పైగా వేగంతో కారు నడుపుతున్నాడని తెలిపారు. నిర్లక్ష్యంగా అతి వేగంతో కారు నడిపి మహిళ మరణానికి కారకుడైన అతడిని అరెస్ట్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును పోలీసులు కోరారు.కాగా, ఈ నెల 12 వరకు అతడి అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్‌ చేయకుండా చూడాలని కృష్ణ మిలన్‌రావు ఈ నెల 4న దాఖలు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈనెల 12న హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *