Breaking News
Home / States / సచివాలయం కూల్చివేతకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్…

సచివాలయం కూల్చివేతకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్…

తెలంగాణ సర్కార్ కు రాష్ట్ర హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయాన్ని కూల్చేవేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివెయ్యొద్దంటూ హైకోర్టులో దాదాపుగా 10 పిటిషన్ లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు సుదీర్ఘకాలంగా విచారణ జరిపి, కూల్చివేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కొత్త సచివాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

చాలా కాలం క్రితమే సచివాలయాన్ని కూల్చేసి, దాని స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే, హైకోర్టులో కూల్చివేతకు సంబంధించిన పిటీషన్లు దాఖలు కావడంతో ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. ఇప్పటికే సచివాలయంలోని అన్ని కార్యాలయాలను బిఆర్కే ఆఫీస్ కు తరలించిన సంగతి తెలిసిందే.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *