Breaking News
Home / States / ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ…

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ…

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సమ్మె పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేశాయి. మరోవైపు కార్మిక సంఘాలు కూడా తమ వివరణ ఇచ్చాయి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ రామ్, కార్మిక నేతలు కోర్టుకు చేరుకున్నారు. సమ్మె ప్రారంభమై నేటికి ఆరో రోజు కావడంతో.. కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింప చేయాలంటూ ఓయూ విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కార్మికుల సమస్యలపై కమిటీ వేయాలని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని గతంలో హామీ ఇచ్చారని.. అది చేయకపోవడంతోనే కార్మికులు సమ్మెకు దిగారని పిటిషన్‌లో తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *