Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఒక్క రోజు దీక్ష కోసం అంత ఖర్చా?…

ఒక్క రోజు దీక్ష కోసం అంత ఖర్చా?…

అమరావతి:  ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఢిల్లీలో  ధర్మ పోరాట దీక్ష కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైనం సంచలనంగా మారింది. ఖర్చు లెక్కకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సూర్యనారాయణ రాజు అనే వ్యక్తి  హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్,  న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ కేసుపై ఫైర్ అవుతూ వ్యాఖ్యలు చేశారు.

ఇంత పెద్ద మొత్తాన్ని ఏచట్టం కింద విడుదల చేశారు అని 10కోట్ల రూపాయలు ఒక రోజు దీక్ష కోసం ఖర్చు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాధనాన్ని వృథా చేస్తూ నిధుల్ని విడుదల చేసిన అధికారులు ఎవరని ప్రశ్నించింది. పన్ను రూపంలో ప్రజల వద్ద వసూలు చేసిన ధనాన్ని,  రాజకీయ కార్యక్రమాల కోసం  విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు అని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన అన్ని వివరాల్ని సమర్పించాలని  విచారణను నవంబర్ 21న వాయిదా వేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *