Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రేపు సీఎం జగన్‌తో భేటీ కానున్న హైపవర్ కమిటీ

రేపు సీఎం జగన్‌తో భేటీ కానున్న హైపవర్ కమిటీ

తాడేపల్లి : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్‌ కమిటీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తో సమావేశం కానుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రాజధాని రైతుల సమస్యలపై హైపవర్‌ కమిటీ సభ్యులు సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించనున్నారు. ఇప్పటికే జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను హైపవర్‌ కమిటీ పరిశీలించిన సంగతి తెలిసిందే. మూడు సార్లు సమావేశమైన కమిటీ సభ్యులు రెండు నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే రేపు చివరిసారిగా సీఎం వైఎస్‌ జగన్‌తో హైపవర్‌ కమిటీ భేటీ కానుంది. కాగా, పరిపాలన వికేంద్రీకరణపై ఈ నెల 20న ఏపీ అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *