Breaking News
Home / States / Andhra Pradesh / నా భర్త నాకు కావాలి..

నా భర్త నాకు కావాలి..

మద్దిలపాలెం (విశాఖపట్నం): ‘ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అగ్నిసాక్షిగా తాళికట్టాడు. మోజు తీరాక అదనపు కట్నం తేవాలంటూ వేధిస్తున్నాడు. ప్రశ్నిస్తే చావగొట్టి ముఖం చాటేశాడు. నా భర్త నాతో కాపురం చేసేలా చర్యలు తీసుకోండి…’ అంటూ దీపిక అనే హిజ్రా విశాఖ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీపిక (25)ది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. విశాఖలోని పెదవాల్తేరులో స్థిరపడింది. 2009లో ఆపరేషన్‌ చేయించుకుని మహిళగా మారింది. నాలుగేళ్ల కిందట శివాజీపాలేనికి చెందిన చందక సురేశ్‌ ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి ప్రతిపాదన తేవడంతో దీపిక అంగీకరించింది. అయితే తాను హిజ్రాను కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రానివ్వనని అగ్రిమెంట్‌ రాసివ్వాలని కోరింది. సురేశ్‌ రాసిచ్చాడు. గతేడాది అక్టోబర్‌ 6న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వారి కాపురంలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. దీపికను సురేశ్‌, అతని మేనమామ భార్య కలిసి తమకు మరో రూ.ఆరు లక్షలు కావాలంటూ వేధించడం మొదలుపెట్టారు. అదేమిటని ప్రశ్నిస్తే ఆమెను చితక్కొట్టిన సురేశ్‌ అప్పటి నుంచి ఆమె వద్దకు వెళ్లడం మానేశాడు. దీంతో దీపిక న్యాయం కోసం జూలై 27న మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సురేశ్‌కు కౌన్సెలింగ్‌ చేసినా మారకపోవడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.

Check Also

హోదా ఇవ్వం.. మరోమారు తేల్చిచెప్పిన కేంద్రం

Share this on WhatsAppన్యూడిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. దానికి బదులుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *