Breaking News
Home / National / సుప్రీంకోర్టులో హిందూ మహాసభ రివ్యూ పిటిషన్…

సుప్రీంకోర్టులో హిందూ మహాసభ రివ్యూ పిటిషన్…

న్యూఢిల్లీ : అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై హిందూ మహాసభ సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయోధ్యలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. దీనిపై హిందూమహాసభ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో సమర్పించింది. అయోధ్యలో ముస్లింములు మసీదు నిర్మించుకునేందుకు 5 ఎకరాల భూమిని మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ హిందూమహాసభ పక్షాన తాను రివ్యూ పిటిషన్ దాఖలు చేశానని న్యాయవాది విష్ణుజైన్ చెప్పారు. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో ఆలయ నిర్మాణానికి వీలుగా 3,4 నెలల్లో ట్రస్టును ఏర్పాటు చేసి భూమిని అప్పగించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయి నేతృత్వంలని బెంచ్ తీర్పునిచ్చింది. దీంతోపాటు అయోధ్యలోని ప్రధాన ప్రాంతంలో మసీదు నిర్మాణానికి వీలుగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా దీనిపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు రివ్యూ పిటిషన్ వేసింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *