Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సీఎంపై ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి….

సీఎంపై ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి….

అమరావతి: ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు అమరావతి వెళితే చెప్పులు, రాళ్లు వేశారని అవంతి అన్నారు. సభా సమయాన్ని టీడీపీ సభ్యులు వృధా చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ అన్నారు. ఒక ముఖ్యమంత్రిని ఎలా సంభోదించాలో చంద్రబాబుకు తెలియదా? సీఎంపై చంద్రబాబు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడినా చంద్రబాబు మారడం లేదు. నాడు బూతులు మాట్లాడి, నేడు నీతులు చెబుతున్నారని అవంతి అన్నారు. చంద్రబాబు తన గౌరవాన్ని తగ్గించుకోవద్దని అన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేయడం కాదు.. సంస్కారం నేర్చుకోవాలి. సీఎం జగన్ కు ఉన్న సంస్కారం చంద్రబాబుకు లేదని మంత్రి అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *