అమరావతి: విశాలాంధ్ర పూర్వ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ‘‘మూడు దశాబ్దాల పాటు విశాలాంధ్ర పత్రిక ప్రధాన సంపాదకులుగా సేవలందించిన చక్రవర్తుల రాఘవాచారి మరణం బాధాకరం.. జర్నలిజంతో సమాజానికి సేవలు అందించిన రాఘవాచారి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని కన్నా ట్వీట్ చేశారు.
