Breaking News
Home / News / ఆయన పథకాలు దేశానికి ఆదర్శం..

ఆయన పథకాలు దేశానికి ఆదర్శం..

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ 97వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం నెక్లెస్‌ రోడ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ”ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలి. విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారు” అని వివరించారు.

సినీ పరిశ్రమ పునఃప్రారంభంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. జూన్‌ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. చిత్రీకరణ తుదిదశకు వచ్చిన సినిమాలకు ముందు అవకాశం ఇవ్వాలని సూచించాను. జీవో వచ్చాక సినిమాల చిత్రీకరణలు ప్రారంభమవుతాయి” అని బాలకృష్ణ తెలిపారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *