Breaking News
Home / National / ఆయన చేసిన ప్రకటన అవాస్తవం: పాక్

ఆయన చేసిన ప్రకటన అవాస్తవం: పాక్

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పిఒకె)లో కనీసం మూడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని భారత ఆర్మీ చేసిన ప్రకటన అవాస్తవమని పాకిస్తాన్‌ పేర్కొంది. విదేశీ దౌత్యవేత్తలను, మీడియాను తీసుకుని ఆ ప్రాంతంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకోవడానికి భారత్‌ను ఆహ్వానిస్తున్నామని పాకిస్తాన్‌ పేర్కొంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న భారత ఆర్మీ చీఫ్‌ మూడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పడం తీవ్రమైన అసంతృప్తిని కలిగించిందని పాకిస్తాన్‌ మేజర్‌ జనరల్‌ గఫూర్‌ అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *