విజయనగరం: విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నేడు విజయనగరంలో కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించారు. దత్తిరాజేరు మండలంలో బుధవారం భారీ వర్షం కురుస్తోంది. బాడంగి, సాలూరు మండలాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది.
