Breaking News
Home / Film News / హాలీవుడ్ స్టార్ ఆత్మహత్యాయత్నం…

హాలీవుడ్ స్టార్ ఆత్మహత్యాయత్నం…

ఫిల్మ్ న్యూస్: ఈ ఏడాది సెన్సేషనల్ అయిన హాలీవుడ్ చిత్రాల్లో `అవెంజర్స్ ది ఎండ్` గేమ్ ఒకటి. ఈ చిత్రంలో కీలక పాత్రధారిగా నటించిన స్టార్ జెరెమీ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. డ్రగ్స్‌కు బానిసైన ఈ హీరో నోట్లో గన్ పెట్టుకుని కాల్చుకునే ప్రయత్నం చేశాడు. అదే గన్‌తో ఇంటి పైకప్పుపై కాల్పులు జరిపాడు. తన మాజీ భార్య సోనీ పచెకోను హత్య చేస్తానని బెదిరించాడు. 2014లో నటి, మోడల్ సోనీ పచెకోను జెరెమీ వివాహం చేసుకున్నాడు. అయితే ఏడాది తర్వాత మనస్పర్ధలతో ఇద్దరూ విడిపోయారు. వీరి కుమార్తె `అవా` ఎవరి దగ్గరుండాలనే దానిపై ప్రస్తుతం కోర్టులో కేసు కూడా నడుస్తుంది. కోర్టు నవంబర్‌లో ఈ కేసు తీర్పును చెప్పనుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *