Breaking News
Home / National / మత కలహాలను ప్రేరేపించిన వారిపై పీడీ యాక్టు

మత కలహాలను ప్రేరేపించిన వారిపై పీడీ యాక్టు

హైదరాబాద్ : మత కలహాలను ప్రేరేపించిన వారిపై పీడీ యాక్టులు పెడతామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ హోంశాఖ మంత్రిగా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్న మహమూద్ అలీ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో నేరాలను అదుపు చేసేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈవ్ టీజర్లపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. కట్నం కోసం భార్యలను వేధించే భర్తలపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. తాను హోంశాఖ మంత్రిని అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాల నాయకులను గౌరవిస్తారని, పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని మంత్రి మహమూద్ అలీ వివరించారు.

Check Also

తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం

Share this on WhatsAppన్యూఢిల్లీ : 17 వ లోక్ సభ లో తెలంగాణ కు చెందిన సభ్యులు ఎంపీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *