Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ పై హోంమంత్రి ట్వీట్…

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ పై హోంమంత్రి ట్వీట్…

అమరావతి: శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తూ పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా.. ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అంటూ భగవద్గీతలోని శ్లోకాన్ని ట్వీట్ చేశారు. ‘సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసం … ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను’ అనేది ఆ శ్లోకం తాత్పర్యం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *