Breaking News
Home / Crime / హోంవర్క్ చేయలేదని చావబాదారు

హోంవర్క్ చేయలేదని చావబాదారు

పఖాంజూర్: ఛత్తీస్‌గఢ్‌లోని పఖాంజూర్‌లో గల ఒక ప్రైవేటు పాఠశాలలో హోమ్‌వర్క్ చేయలేదని నాల్గవ తరగతి విద్యార్థిని చావబాదిన ఉదంతం వెలుగు చూసింది. బాధిత విద్యార్థి మోకాళ్లపై ఉన్న దెబ్బలను చూసిన తల్లిదండ్రులు స్కూలుకు చేరుకుని, సంబంధిత ఉపాధ్యాయుణ్ణి నిలదీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని, ప్రిన్సిపాల్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఈ నేపధ్యంలో పాఠశాల యాజమాన్యం బాధితులను క్షమాపణలు కోరింది. అయితే డీఈవో దీనిపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి, విచారణకు ఆదేశించారు. దీనికితోడు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు.

Check Also

జ‌వాన్ ప్రదీప్‌సింగ్ కుటుంబం సంచ‌ల‌న వ్యాఖ్యలు

Share this on WhatsAppన్యూఢిల్లీ: అమ‌రుడైన జ‌వాన్ ప్రదీప్‌సింగ్ కుటుంబం సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీ మాట‌ల‌ను, ప్రభుత్వాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *