ఫిల్మ్ న్యూస్: కొత్త తారలతో తమిళంలో రూపొందుతున్న హర్రర్ చిత్రం ‘పచ్చై విళక్కు’. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిని శిక్షించే వైవిధ్యమైన దెయ్యం కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటివరకు వచ్చిన హర్రర్ చిత్రాలు దేనితోనూ పోలిక లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు డాక్టర్ మారన్ తెలిపారు. కన్నడ తార రూబిక దెయ్యం పాత్రలో హీరో మారన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు. రెండో హీరోగా ‘అమ్మణి’ ఫేమ్ మహేష్, ముఖ్య పాత్రల్లో ఇమాన్ అన్నాచ్చి, నెల్లై శివ, ‘మెడ్రాస్’ ఫేమ్ నందు తదితరులు నటిస్తున్నారు. షూటింగ్ అధిక భాగం చెన్నై, పరిసర ప్రాంతాల్లో జరిగింది. బాలాజీ సినిమాటోగ్రఫి, దేవేంద్రన్ సంగీతం అందించిన ‘పచ్చై విళక్కు’ వచ్చే నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
