Breaking News
Home / Lifestyle / Recipes / వేడి వేడి చందువా చిప్స్‌ మీ కోసం…!

వేడి వేడి చందువా చిప్స్‌ మీ కోసం…!

చందువా చిప్స్‌

కావలసినవి: మీడియం సైజు చందువా చేప ఒకటి, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి, ఆవపిండి, నూనె తగినంత, బ్రెడ్‌ పొడి కొద్దిగా, మైదా 2 టేబుల్‌ స్పూన్లు, గుడ్డు ఒకటి.

తయారీ విధానం: చేపని నాలుగు ముక్కలుగా కట్‌ చేసి వాటిలో ముళ్లని తీసివేసి శుభ్రంగా కడగాలి. నిమ్మరసంలో ఉప్పు, మిరియాల పొడి, ఆవపిండి బాగా కలిపి చేపకు పట్టించి పది నిమిషాల పాటు ఉంచేయాలి. గుడ్డు సొనని గిలక్కొట్టి అందులో మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు కూడా పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చేప ముక్కల్ని ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించి కాగిన నూనెలో బాగా వేగించాలి. వీటిని వేడి వేడిగా ఏదన్నా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Check Also

సజ్జలతో మంచూరియా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు: సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *