చికెన్ సూప్
కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు – వంద గ్రాములు, నీరు – 1 లీటరు, ఉల్లి (తరుగు) – 1, కాప్సికం (తరుగు) – 1, పచ్చిమిర్చి (తరుగు) -2, వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూను, గుడ్డు (తెల్ల సొన) – 1, వెనిగర్ – 1 టేబుల్ స్పూను, కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు, పంచదార, ఉప్పు, మిరియాలపొడి – రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో కార్న్‌ఫ్లోర్ తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి మూతపెట్టి (చికెన్ ముక్కలు మెత్తబడేదాక) 15 నిమిషాలు మరిగించి (చికెన్) ఎముకలు తీసేయాలి. ఒక కప్పులోకి కొద్ది స్టాక్ తీసుకుని కార్న్‌ఫ్లోర్ ఉండలు చుట్టకుండా కలిపి మిశ్రమంలో పోసి 2 నిమిషాల పాటు మరిగించాలి. అంతే వేడి వేడి చికెన్ సూప్ రెడీ.