Breaking News
Home / National / ధోనీ లాంటి కెరీర్‌ ఎంతమందికి ఉంటుంది…

ధోనీ లాంటి కెరీర్‌ ఎంతమందికి ఉంటుంది…

మాంచెస్టర్‌: టీమిండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల నేపథ్యంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్ స్పందించాడు. రిటైర్మెంట్‌ విషయం ధోనీకే వదిలేయాలని, అందులో ఎవరూ జోక్యం చేసుకోకూడదని అన్నాడు. భారత జట్టుకు ధోనీ అందించిన సేవలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని మాస్టర్‌ బ్లాస్టర్‌ చెప్పాడు. ‘భారత జట్టులో అతడిది ప్రత్యేక స్థానం. ధోనీలాంటి కెరీర్‌ ఎవరికి ఉంటుంది? అతడు టీమిండియాకి అందించిన సేవలే ప్రజల గుండెల్లో నమ్మకానికి అద్దం పడతాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అతడు ఔటయ్యే వరకు భారత్‌ ఓడిపోలేదు. అతడు గెలిపిస్తాడనే నమ్మకం అందరిలోనూ ఉండింది’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

కాగా ధోనీ, రవీంద్ర జడేజాతో కలిసి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా వికెట్‌ కాపాడుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం చేసి టీమిండియాను విజయానికి చేరువచేశారు. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్‌ పైచేయి సాధించింది. 49వ ఓవర్‌లో మార్టిన్‌ గప్తిల్‌ డైరెక్ట్‌ త్రో విసరడం ద్వారా ధోనీ(50) వెనుతిరిగాడు. దీంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.

Check Also

మరోసారి వార్తల్లో నిత్యానంద

Share this on WhatsAppఅహ్మదాబాద్: నిత్యానంద నిర్వహణలో ఉన్న స్కూల్లో తమ ఇద్దరు కూతుళ్లను నిర్భంధించారని..వారిని విడిపించాలంటూ గుజరాత్ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *