Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రాళ్లు వేయకుండా.. పూలు వేస్తారా …

రాళ్లు వేయకుండా.. పూలు వేస్తారా …

 తాడేపల్లి: రాజధాని పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై రాళ్లు వేయకుండా.. పూలు వేస్తారా అని వైఎస్సార్‌సీపీ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు మోసం చేశారు కాబట్టే ప్రజలు, రైతులు తిరుగబడ్డారని చురకలు అంటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. నిన్నటి వరకు ఇసుక అన్న చంద్రబాబు.. నేడు లాఠీ అని మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ప్రజలు తగిన బుద్ది చెప్పినా ఏ మార్పు రాలేదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *