Breaking News
Home / Lifestyle / Business / యాపిల్‌ను దాటేసిన హువే..

యాపిల్‌ను దాటేసిన హువే..

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో రెండో స్థానానికి చేరిక
ఐడీసీ వెల్లడి
శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. సామ్‌సంగ్‌, యాపిల్‌ తదితర దిగ్గజ కంపెనీల అమ్మకాలు క్షీణిస్తున్నాయి. ఇదేకాలంలో చైనాకు చెందిన హువే మాత్రం అమ్మకాలను పెంచుకోవడమేకాకుండా మార్కెట్‌ వాటా విషయంలో మరింత పట్టుసాధిస్తుండటం విశేషం. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ పరంగా ఇప్పటిదాకా కాలిఫోర్నియాకు చెందిన యాపిల్‌ రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడీ స్థానా న్ని హువే సొంతం చేసుకుంది. చైనాకు చెందిన ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి ప్రముఖ మొబైల్‌ కంపెనీల అమ్మకాలకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది. వీటి ప్రకారం..

  • ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 31.08 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలం(33.27 కోట్లు)తో పోల్చితే అమ్మకాలు 6.6 శాతం మేర తగ్గాయి.
  • వరుసగా ఆరు త్రైమాసికాల్లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు తగ్గాయి. దీన్ని బట్టి ఈ ఏడాదిలోనూ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
  • మొదటి త్రైమాసికంలో సామ్‌సంగ్‌ అమ్మకాలు 8.1 శాతం తగ్గి 7.19 కోట్లకు చేరుకున్నాయి. మార్కెట్‌ వాటా 23.1 శాతంగా ఉంది.
    ఇదే కాలంలో హువే అమ్మకాలు 50.3 శాతం వృద్ధి చెంది 5.91 కోట్లకు చేరుకున్నాయి. దీంతో ఈ కంపెనీ రెండో స్థానంలో నిలిచింది. మార్కెట్‌ వాటా 19 శాతంగా నమోదైంది.
  • యాపిల్‌ ఐఫోన్ల అమ్మకాలు మాత్రం మొదటి త్రైమాసికంలో 30.2 శాతం తగ్గి 3.64 కోట్ల యూనిట్లకు చేరాయి. దీంతో ఈ కంపెనీ మూడోస్థానానికి జారిపోయింది. మార్కెట్‌ వాటా 11.7 శాతంగా ఉంది.
  • వరుసగా తర్వాతి స్థానాల్లో షామీ, వివో, ఒప్పో కంపెనీలున్నాయి.కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్‌ కావడానికి కస్టమర్లు ఎదురుచూస్తుండటంవల్లనే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలపై ప్రభావం పడుతోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
  • 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు 5జీ ఫోన్ల కోసం కూడా వేచి చూస్తున్నట్టు సమాచారం.
  • భారత్‌ చాలెజింగ్‌ మార్కెట్‌ :టిమ్‌ కుక్‌
    దీర్ఘకాలికంగా చూస్తే భారత్‌ చాలా ముఖ్యమైన మార్కెట్‌ అని, స్వల్పకాలంలో మాత్రం చాలా సవాలుతో కూడుకున్నదని యాపిల్‌ సీఈఓ టిక్‌ కుక్‌ పేర్కొన్నారు. ఈ మార్కెట్‌ నుంచి తాము చాలా నేర్చుకుంటున్నామన్నారు. భారత మార్కెట్‌కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నామని, వీటిఫలితాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలకు సంబంధించిన కాన్ఫరెన్స్‌ కాల్‌ సందర్భంగా భారత మార్కెట్‌పై ఆయన మాట్లాడారు. భారత్‌లో రిటైల్‌ స్టోర్ల ఏర్పాటు యోచనలో ఉన్నామని, ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. భారత్‌లోనే ఫోన్ల తయారీని ప్రారంభించామని, ఫలితంగా కస్టమర్లకు మరింత అందుబాటు ధరల్లోనే ఫోన్లను అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. భారత్‌లో యాపిల్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ధరను గత నెలలో 22 శాతం వరకు తగ్గించింది.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *