Breaking News
Home / social media / కారు తుడిస్తే హగ్‌ ఇచ్చింది.. కానీ

కారు తుడిస్తే హగ్‌ ఇచ్చింది.. కానీ

 వైరల్‌ :సరదాగా రోడ్లను, పరిసరాలను శుభ్రం చేస్తుంటారు. అపరిచిత వ్యక్తుల కారు అద్దాలను శుభ్రం చేసి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. అయితే, ఫన్నీ స్టోరీలతో అలరించే ఫ్లోరిడాకు చెందిన బ్లాగర్‌ మేరీ క్యాథరిన్‌ బ్యాక్‌స్టోర్మ్‌ మాత్రం ఇలాగే ఆలోచించి పప్పులో కాలేశారు. క్రిస్టమస్‌ పండగ సందర్భంగా షాపింగ్‌లో బిజీబిజీ ఉన్న ఆమె పొరపాటున ఓ వ్యక్తికి హగ్‌ ఇచ్చారు.షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి బయటికొచ్చిన క్యాథరిన్‌ పార్క్‌ చేసి ఉన్న తన కారును చూసి ఒకింత ఆశ్చర్యం.. మరికొంత ఆనందంలో మునిగారు. తన కారు అద్దాలను శుభ్రం చేస్తున్న వ్యక్తిని హగ్‌ చేసుకున్నారు. కానీ, క్షణాల్లో ఆమె తన పొరపాటును గ్రహించారు. ఆ కారును పరిశీలించి చూడగా..అది తనది కాదని ఆమెకు అర్థం అయింది. వెంటనే నాలుక్కరుచుకుని క్యాథరిన్‌ అక్కడి నుంచి జారుకున్నారు. తనకు ఎదురైన ‘చేదు’అనుభవాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో పంచుకోవడంతో అది వైరల్‌ అయింది. ఈ వీడియో 31 మిలియన్ల వ్యూస్‌ సాధించడం విశేషం. ఇక సొంత కారును శుభ్రం చేసుకుంటున్న వ్యక్తికి హగ్‌ ఇవ్వడం.. నవ్వులు పూయిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాగా నవ్వు తెప్పించే సంఘటనల్లో ఇదొకటని అంటున్నారు.

Check Also

కరోనా కోసం ఫేస్‌బుక్‌లో కొత్తగా రెండు ఎమోజీలు

Share this on WhatsAppప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పూర్తిగా విస్తరించింది. దీని కట్టడికి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో.. అదుపు చేయడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *