Breaking News
Home / States / Andhra Pradesh / జనసేనాని ఇంటి వద్ద భారీ బందోబస్త్….

జనసేనాని ఇంటి వద్ద భారీ బందోబస్త్….

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి విజయవాడకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు, సోదరుడు పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో చిరంజీవి, ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం సీఎంతో చిరంజీవి లంచ్ మీటింగ్ ఉండనుందని సమాచారం. ఇరువర్గాలు మర్యాదపూర్వక సమావేశమేనని అంటునప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కేవలం ‘సైరా’ సినిమాను వీక్షించాలని కోరేందుకే జగన్‌ను చిరంజీవి కలుస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *