Breaking News
Home / Film News / సైరాకు భారీగా కలెక్షన్స్…

సైరాకు భారీగా కలెక్షన్స్…

ఫిల్మ్ న్యూస్: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం ‘ సైరా నరసింహారెడ్డి ‘… అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ టాక్‌ రావడం.. రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటంతో ‘సైరా’ భారీ వసూళ్లు రాబడుతోంది.

గాంధీ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన మార్కెట్‌ అయిన ఏపీ, తెలంగాణలో ఈ సినిమా సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సైరా రూ. 32 కోట్లు రాబట్టింది. పాజిటివ్‌ టాక్‌ ఉండటంతో తొలి మూడు రోజుల్లో సైరాకు భారీగా వసూళ్లు దక్కినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 14.62 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్‌ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ రమేశ్‌ ట్వీటర్ లో వెల్లడించారు. ‘సైరా’థియేటర్లలోనే కాకుండా.. సోషల్‌ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ సినిమాపై సెలెబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *