నెల్లూరు : జిల్లా కేంద్రంలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ కనకదుర్గా మెటల్ ఎంటర్ ప్రైజెస్ గోడౌన్ లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ గల ప్లాస్టిక్ సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని వారిని ఖాళీ చేయిస్తూ.. మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.
