Breaking News
Home / States / Andhra Pradesh / ఏపీ బీజేపీలో భారీగా చేరికలు.. త్వరలో మరికొంత మంది..!

ఏపీ బీజేపీలో భారీగా చేరికలు.. త్వరలో మరికొంత మంది..!

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు.. మరికొందరు నేతలు క్యూలో ఉన్నారని త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని కమలనాథులు మీడియా ముందుకొచ్చినప్పుడల్లా చెబుతున్నారు. అయితే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. వీరిలో కడప జిల్లా నేతలు, మైదుకూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్లికార్జున మూర్తి, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నేతలందరికీ కాషాయం‌ కండువా కప్పి కన్నా సాదారంగా ఆహ్వానించారు. కాగా.. పార్టీలో చేరిన వారిలో హైకోర్టు న్యాయవాదులు శ్రీనివాస్‌మూర్తి, సుజన్ కుమార్, లక్ష్మి ప్రమీల, మరో యాభై మంది కార్యకర్తలు ఉన్నారు.

మోదీ, షాల ద్వయం పనితీరు చూసే..!
ఈ చేరిక అనంతరం మీడియాతో మాట్లాడిన కన్నా.. బీజేపీ ప్రపంచంలో అత్యధికంగా సభ్యత్వం కలిగిన పార్టీ అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా మోడీ, పార్టీ పరంగా అమిత్ షా‌లు కలిసి నడిపిస్తున్నారని తెలిపారు. ‘నేడు ప్రాంతీయ పార్టీల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. ఏపీలో టీడీపీ, వైసీపీల వల్ల ప్రయోజనం లేదని ప్రజలు గుర్తిస్తున్నారు. దేశాభివృద్ధి అనేది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుంది. అందుకే మోదీకి మరోసారి పట్టం కట్టారు.మోదీ, షాల ద్వయం పనితీరు చూసే అనేక మంది బీజేపీలో చేరుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయి’ అని కన్నా చెప్పుకొచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *