Breaking News
Home / States / ఈఎస్‌ఐ స్కాంలో భారీ ఇండెంట్లు స్వాధీనం…

ఈఎస్‌ఐ స్కాంలో భారీ ఇండెంట్లు స్వాధీనం…

హైదరాబాద్‌: ఈఎస్‌ఐ మందుల కుంభకోణం కేసులో ఓమ్మి మెడి సంస్థ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా ఓమ్మి మెడి సంస్థ ఏజెంట్‌ నాగరాజు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.46 కోట్ల విలువైన ఇండెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇండెంట్లు ఏజెంట్ల ఇళ్లలో లభ్యమవడంతో అనిశా అధికారులు విస్తుపోయారు. ఈఎస్‌ఐ సంచాలకుల కార్యాలయంలో ఉండాల్సిన ఇండెంట్లు ఏజెంట్‌ నాగరాజు నివాసంలో ఎందుకు ఉన్నాయనే దానిపై అనిశా అధికారులు దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మంది అధికారులు, ప్రైవేటు వ్యక్తులను అనిశా అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *