Breaking News
Home / National / మద్యం, నగదు పంపిణీపై పోలీసుల కొరడా…

మద్యం, నగదు పంపిణీపై పోలీసుల కొరడా…

హర్యానా : హర్యానా శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీగా మద్యం వరదలై పారుతోంది. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతోంది. మద్యం, నగదు పంపిణీపై పోలీసులు కొరడా ఝళిపించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ప్రారంభమైన తొలి 16 రోజుల్లోనే భారీ మొత్తంలో నగదు, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 8.52 కోట్ల రూపాయిల విలువైన మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. గత మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కేవలం 1.52 కోట్ల రూపాయిల విలువైన మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నది ఐదు రెట్లు ఎక్కువగా ఉందని వారన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *