కర్నూలు: శ్రీశైలం దేవస్థానానికి చెందిన పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బంది భారీగా చేతివాటం ప్రదర్శించినట్టు ఆడిట్లో వెల్లడైంది. మొత్తంగా 42 లక్షల రూపాయల అవకతవకలు జరిగినట్లు ఆడిట్లో అధికారులు గుర్తించారు. అవకవతకలపై ఈవో కేఎస్ రామారావు విచారణ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు పోలీసుల అదుపులో ఉన్నారు.
