Breaking News
Home / States / Andhra Pradesh / మహిళలపై అత్యాచారాలకు నిరసనగా భారీర్యాలీ

మహిళలపై అత్యాచారాలకు నిరసనగా భారీర్యాలీ

అమరావతి న్యూస్, నెల్లూరు : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ల ఆధ్వర్యంలో దిశ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ.. సోమవారం ఉదయం నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల నుండి దాదాపుగా 3 వేల మంది విద్యార్థులతో మహా ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం మండల కమిటి కార్యదర్శి బోట్ట జయమ్మ, జిల్లా కార్యదర్శి శివకుమారి, జిల్లా సహకార్యదర్శి రమమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు షంఫావ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు షేక్‌ సల్మాన్‌ భాష, జి.వినీత్‌ కుమార్‌, పి.ఫాజిల్‌ఖాన్‌, షేక్‌.మున్వర్‌ భాషా లు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *