Breaking News
Home / States / Andhra Pradesh / ఐడీబీఐ బ్యాంకులో భారీ కుంభకోణం

ఐడీబీఐ బ్యాంకులో భారీ కుంభకోణం

పశ్చిమగోదావరి: భీమవరం ఐడీబీఐ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగింది. రూ. 159 కోట్లకు 8 మంది ఆక్వా రైతులు కుచ్చుటోపీ పెట్టారు. కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయ స్వల్ప కాలిక రుణాల పేరుతో 2009 నుంచి 2012 వరకు 226 మంది రైతుల పేరు మీద రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం రూ. 189 కోట్లకు బకాయిలు చేరుకున్నాయి. అప్పటి సీజీఎం దామోదరన్, డీజీఎం రామారావు పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులకు ఐడీబీఐ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. భీమవరంలో రహస్యంగా సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. మరికొన్ని బ్యాంకుల్లోనూ ఇదే తరహా కుంభకోణాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది. ఏబీఎన్‌ చేతిలో ఐడీబీఐ అధికారుల ఫిర్యాదు ప్రతి ఉంది.

Check Also

ఎంఎస్ఎంఈలలో కార్మికుల కొరత ఉంది….

Share this on WhatsAppఅమరావతి: వైస్సార్ నవోదయం కార్యక్రమాన్ని సీఎం జగన్ గురువారం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారని మంత్రి బుగ్గన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *