Breaking News
Home / Lifestyle / Business / ఇన్ఫోసిస్ కు భారీ షాక్

ఇన్ఫోసిస్ కు భారీ షాక్

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కు భారీ షాక్ తగిలింది. కంపెనీ రాబడి, లాభాలని అధికంగా చూపేందుకు ఉన్నతాధికారులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఈ విషయంలో సమీక్షలకు తావులేకుండా అనుమతులు బైపాస్ చేస్తున్నారన్నది ఆరోపణ. ఈ మేరకు కంపెనీలో పనిచేసే ‘ఎథికల్ ఎంప్లాయిస్’ పేరుతో ఏర్పడిన ఒక బృదం ఈ మేరకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు కు, అలాగే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసి) కి ఫిర్యాదు చేసింది.

ఆరోపణలను రుజువు చేసేందుకు తమవద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ బృందం పేర్కొంది. సంబంధిత ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ తమ వద్ద ఉన్నాయని ఎథికల్ ఎంప్లాయిస్ గ్రూప్ చెప్పినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. వాటికి సంబంధించిన ఒక కాపీ ని ఈటీ కి ఇచ్చినట్లు కూడా పత్రిక వెల్లడించింది. దీంతో అలెర్ట్ ఐన కంపెనీ బోర్డు తమ ఆడిట్ కమిటీ కి ఈ విషయాన్నీ పరిశీలించాలని సిఫారసు చేసింది. తమ విజిల్ బ్లోయర్ పాలసీ కి అనుగుణంగా తగు చర్య తీసుకొంటామని ఇన్ఫోసిస్ ఆదివారం రాత్రి అమెరికా మార్కెట్ రెగ్యులేటర్ కు సమర్పించిన స్టేట్ మెంట్ లో తెలిపింది.

Check Also

నెల్సన్‌ మండేలా కుమార్తె కన్నుమూత

Share this on WhatsAppజోహన్నెస్‌ బర్గ్‌, జూలై 13: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా కుమార్తె జిండ్జీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *