వడోదర : కీలక దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు టీమిండియా మహిళల జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వన్డే ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్, టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన బొటన వేలి గాయం అవ్వడంతో దీని కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి తప్పుకుంది. ప్రాక్టీస్‌లో భాగంగా ఈ క్రికెటర్ బొటన వేలికి గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం మంధానకు విశ్రాంతి అవసరవని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక గత కొద్దికాలంగా టీమిండియా వన్డే విజయాల్లో స్మృతి మంధాన కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మంధాన గాయం కారణంగా దూరం కావడంతో బ్యాటింగ్ భారం మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లపై పడనుంది.