Breaking News
Home / National / సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్

సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్

జమ్మూకాశ్మీర్: జమ్మూకశ్మీర్ లో ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. సదరు వ్యక్తి జమ్మూకాశ్మీర్ త్రికూట ప్రాంతంలో ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు సెల్‌టవర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, రెస్క్యూ టీం చాలా సేపు కష్టపడి ఆ వ్యక్తిని సురక్షితంగా కిందికి దింపారు. మతిస్థిమితం లేకపోవడంతో సదరు వ్యక్తి సెల్‌టవర్‌ పైకి ఎక్కాడని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *