రాజేంద్రనగర్: భార్యను ఓ భర్త అతికిరాతకంగా చంపాడు. గండిపేట మండలం, నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధిలో కాంతయ్య అనే వ్యక్తి తన భార్య శ్రీదేవిని రోకలిబండతో తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో ఆమె తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హంతకుడు కాంతయ్యను పోలీసులు అరెస్టు చేసి, విచారిస్తున్నారు.
