హుజూర్నగర్: హుజూర్నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నికలో పోటీకి భారీగా అభ్యర్థులు ఆసక్తి కనబరిచారు. అధికార టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, సీపీఎం నుంచి పారేపల్లి శేఖర్‌రావు, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు రేపు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు అక్టోబర్ 3వ తేదీ తుది గడువు. అక్టోబర్ 21న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.
