Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / తప్పే.. ఆ పాపంలో నేను కూడా భాగస్వామినే: స్పీకర్ తమ్మినేని

తప్పే.. ఆ పాపంలో నేను కూడా భాగస్వామినే: స్పీకర్ తమ్మినేని

అమరావతి: ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ తమ్మినేని- టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు స్పీకర్ తమ్మినేని స్పందిస్తూ.. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఎన్టీఆర్ విషయంలో తప్పే..!
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. వైసీపీ ఆఫీసన్న విపక్ష నేత మాటలు వెనక్కి తీసుకోవాలని ఆయన తెలిపారు. సభపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. అసెంబ్లీ ప్రజల జాగీర్‌ మాత్రమేనని స్పీకర్‌ స్పష్టం చేశారు. గతంలో సభలో ఎన్టీఆర్‌కు అవకాశం ఇవ్వకపోవడం తప్పేనన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని స్పీకర్‌ తమ్మినేని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *