Breaking News
Home / Sports / నా జీవితంలో మర్చిపోలేను: యువరాజ్

నా జీవితంలో మర్చిపోలేను: యువరాజ్

ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ముంబయిలో మీడియా సమావేశంలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు. క్రికెట్ కోసం నా రక్తం ధారపోశా. క్యాన్సర్ బాధితులకు సాయం చేయడమే తదుపరి లక్ష్యం. నాపై నేనెప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. టీ20, 2011 వరల్డ్‌కప్‌ నా జీవితంలో మరిచిపోలేనివి. నా కెరీర్‌లోనే గొప్ప విజయాలవి. ప్రస్తుతానికి ఐపీఎల్‌తో పాటు విదేశీ లీగ్‌లలో ఆడుతా. మొత్తం 25 ఏళ్ల క్రికెట్ జీవితంలో.. 22 గజాల పిచ్‌పై దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ తర్వాత.. ఇక వీడ్కోలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. ఎలా పోరాడాలో.. పడ్డ తర్వాత లేచి.. దుమ్ము దులుపుకుని ఎలా ముందుకు సాగి పోవాలో ఈ ఆట నాకు నేర్పింది’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు.

మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువీ 1900 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో 304 మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. వన్డేల్లో 14 సెంచరీలు చేశాడు. 52 హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ 1177 పరుగులు నమోదు చేశాడు. టీ20ల్లో 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 132 ఐపీఎల్ మ్యాచుల్లో 2750 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో యువరాజ్‌ ఆడనున్నట్టు తెలుస్తోంది.

Check Also

ఇంగ్లండ్‌ కీలక క్రికెటర్స్ పలు మ్యాచ్ లకు దూరం

Share this on WhatsAppమాంచెస్టర్‌: శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ తొడ కండరాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *