Breaking News
Home / Film News / ఇప్పట్లో మళ్లీ ఇలాంటి పాత్ర చేయలేను…

ఇప్పట్లో మళ్లీ ఇలాంటి పాత్ర చేయలేను…

ఫిల్మ్ న్యూస్: ఉయ్యలవాడ నర్సింహారెడ్డి పాత్రలో కనిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన `సైరా` చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి పలు విషయాలు వెల్లడించారు.

`ఈ సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు ఒక గొప్ప ఫీలింగ్‌తో బయటకు వస్తారని నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా ప్రారంభం అయినప్పట్నుంచి నేను చాలా మారిపోయాను. నవ్వడం మానేశాను. సీరియస్ అయిపోయాను. ఇప్పట్లో మళ్లీ ఇలాంటి పాత్ర చేయలేను. భగత్ సింగ్ క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అయితే ఇక ఆ పాత్ర చేయలేననుకుంటున్నాను. ఆ పాత్ర చరణ్ చేస్తే బాగుంటుందనుకుంటున్నాన`ని చిరంజీవి చెప్పారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *