Breaking News
Home / States / Andhra Pradesh / బీజేపీలో ఎవరెవరు చేరుతున్నారో నాక్కూడా తెలియదు: సుజనా

బీజేపీలో ఎవరెవరు చేరుతున్నారో నాక్కూడా తెలియదు: సుజనా

విజయవాడ: బీజేపీలో చేరిన తర్వాత కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి తొలిసారి విజయవాడకు వచ్చారు. బీజేపీలో ఎవరెవరు చేరుతున్నారో తనకు కూడా తెలియదని అన్నారు. ఆదివారం గుంటూరులో పదాధికారుల సమావేశంలో పాల్గొనే క్రమంలోనే తాను విజయవాడకు వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి ప్రముఖ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఇవాళ గుంటూరులో బీజేపీ ఎగ్జిక్యూటీవ్ సమావేశం ఉందని, అక్కడకు వెళుతూ.. విజయవాడలో పరిచయ కార్యక్రమం గురించి వచ్చినట్లు చెప్పారు. ఇవాళ చాలామంది బీజీపీలో చేరుతున్నారన్న వార్తలు తాను మీడియా ద్వారా వింటున్నానని, ఎవరెవరు పార్టీలో చేరుతున్నది తనకు కూడా తెలియదని సుజనా చెప్పారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడతానని ఆయన అన్నారు.

Check Also

టీడీపీ పార్టీపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: గత టీడీపీ ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు నమ్మలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆరోపించారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *