Breaking News
Home / Sports / నాకెంతో గర్వంగా ఉంది: విరాట్ కోహ్లీ

నాకెంతో గర్వంగా ఉంది: విరాట్ కోహ్లీ

తిరువనంతపురం: విజయం కోసం అంకితభావంతో పనిచేసే జట్టులో ఉన్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. తిరువనంతపురంలో విండీస్‌తో జరిగిన ఐదో వన్డేలో విజయం సాధించిన అనంతరం కోహ్లీ ట్వీట్ చేస్తూ.. సిరీస్ విజయం కోసం కుర్రాళ్లు కృషి చేశారని ప్రశంసించాడు. ఇటువంటి జట్టులో ఉన్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. ఫలితంగా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 104 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

Check Also

ఐపీఎల్ సీజన్-12: ఢిల్లీ టార్గెట్ 169

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఐపీఎల్‌-12లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా జరుగుతోన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ వర్సెస్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *