అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో రూ.9 వేల కోట్ల పనులు ప్రారంభమయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అందులో రూ.5,400 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. మొత్తం రూ.40 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచినట్టు బొత్స వివరించారు. వేల కోట్ల అవినీతికి తలుపులు తెరిచారని మాత్రమే చెప్పానని… రూ.30వేల కోట్ల అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేదని బొత్స వెల్లడించారు.
