Breaking News
Home / States / Andhra Pradesh / జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆమంచి చదివారు: అనురాధ

జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆమంచి చదివారు: అనురాధ

విజయవాడ: ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారంపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారినప్పుడు నిజాలు మాట్లాడకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం దురదృష్టకరమని అన్నారు. సీఎం సహాయనిధి నుంచి చీరాలలో 1000 మందికి రూ.6.11 కోట్లు ఇచ్చారని అన్నారు. వారందరిది ఏ కులం? అని అనురాధ ప్రశ్నించారు. చీరాలలో జరిగిన అభివృద్ధిని ఆమంచి ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే వైసీపీ నిరసన తెలపకపోగా స్వాగత బ్యానర్లు కట్టారని ఆమె విమర్శించారు. జగన్‌ కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని పంచుమర్తి అనురాధ ఆరోపించారు.

Check Also

జవాన్ల కుటుంబాలకు సహాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Share this on WhatsAppఅమరావతి: పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *